అక్కడ నీళ్ళలో రాజకీయ నిప్పులు రాజుకుంటున్నాయి. చెక్ డ్యామ్‌తో పరస్పరం చెక్ పెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు మొదలు పెట్టిన గేమ్ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది. ఏంటా గేమ్? ఎవరు ఎవరికి చెక్‌మేట్? మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎట్నుంచి ఎటు పోతోంది? దోషులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతోపాటు రైతులకు సాగు నీరు ఇచ్చేందుకు గతంలో చెక్ డ్యామ్‌లు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లు…