charlie chaplin: నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఈ ఘటన జరిగి పది రోజులు అయ్యినట్లు తెలుస్తోంది. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఈ మధ్యనే మీడియాకు అధికారికంగా ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. జోసెఫిన్ చాప్లిన్ వయస్సు 74.
విశ్వవిఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత చార్లీ చాప్లిన్ జన్మతః క్రిస్టియన్ అయినా, తరువాతి రోజుల్లో ఆయన మతం, వర్ణం అన్నవాటికి దూరంగా ఉన్నారు. మానవత్వమే అసలైన మతం అని తెలుసుకున్నానని తరువాత చెబుతూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చార్లీ చాప్లిన్ అంతటి ప్రాచుర్యం పొందిన నటుడు ఆయన కాలంలో లేరు. ఆ తరువాత కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు. తాను యేసు క్రీస్తు కంటే ఖ్యాతి చెందానని ఒకప్పుడు చెప్పుకున్నారు చాప్లిన్. దాంతో ఆయన జన్మించిన ఇంగ్లండ్,…