ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతోంది.. రాష్ట్రానికి పెట్టుబడులు, రాజధాని అమరావతి అభివృద్ధియే అజెండాగా సాగుతోన్న ఈ పర్యటనలో కీలక సమావేశాలు, చర్చలు, ఒప్పందాలు కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా బిజీగా గడపుతున్న చంద్రబాబు.. ఇవాళ నాల్గో రోజు కీలక సమవేశాలు నిర్వహించబోతున్నారు.. వివిధ సంస్థలు-సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు..