‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు. అలా పలు ప్రశంసలు అందుకుంటూనే చంద్రమోహన్ తనదైన అభినయంతో జనాన్ని పరవశింపచేశారు. కొన్ని చిత్రాలలో కథానాయకునిగానూ అలరించారు. అనేక సినిమాలలో అభినయ ప్రాధాన్యమున్న పాత్రల్లో మురిపించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1945 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో ఆయన జన్మించారు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే…