చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది 'ఇండియా' కూటమికి పెద్ద విజయం అని అభివర్ణించారు. ఇండియా కూటమికి ఇది తొలి విజయమని, దీనికి అర్థం ఎంతో ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి సుప్రీం నిర్ణయంపై కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.