Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా చందు మొండేటి గతేడాది కార్తికేయ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.