రైల్వేలో ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె చందా యాదవ్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు గురువారం నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.