సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఈ నెల 24న చలపతిరావు మృతి చెందగా, ఆయన కుమార్తెలు విదేశాల్లో ఉండడంతో ఇంతవరకు అంత్యక్రియలు నిర్వహించలేదు.
Chalapathi Rao: ‘ఇండస్ట్రీలో చాలామంది మా నాన్నను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారు’ అని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు.