చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ స్వయంకృషితో చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన వారు. వారిద్దరూ కలసి ‘శ్రీరామబంటు’ మొదలు ‘కొదమసింహం’ వరకు అనేక చిత్రాల్లో మిత్రులుగా, శత్రువులుగా నటించి అలరించారు. 35 ఏళ్ళ క్రితం చిరంజీవి, మోహన్ బాబు మిత్రులుగా నటించిన ‘చక్రవర్తి’ కూడా జనాన్ని ఆకట్టుకుంది. తరువాతి కాలంలో చిరంజీవికి ‘యముడికి మొగుడు’, మోహన్ బాబుకు ‘పెదరాయుడు’ వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘చక్రవర్తి’ రూపొందడం విశేషం!…
(సెప్టెంబర్ 8న చక్రవర్తి జయంతి) తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన…