2027లో ఏపీలో జాతీయ క్రీడలు నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నాం అన్నారు ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి కుమార్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో అధునాతన క్రీడా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నిర్దేశించారు. ఏపీలో పలు జిల్లాల్లో హాస్టల్ వసతులుతో కూడిన క్రీడా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తాం. “ఖేలో ఆంధ్ర ప్రదేశ్” గా ఏపీని తీర్చిదిద్దడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం అన్నారు.