హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన సెంచురీ ఆస్పత్రి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో వాకర్ల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని వయసులకు చెందిన 200 మందికి పైగా వాకర్లు ఈ శిబిరంలో పాల్గొని ఉచితంగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. దాంతో పాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల నుంచి సలహాలతో ప్రయోజనం పొందారు. రక్తపోటు పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలు, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ విశ్లేషణ లాంటి పరీక్షలను…