కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ షుఖ్ మాండవీయ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల అమలును పరిశీలించనున్నారు కేంద్ర మంత్రి మాండవీయ. గుంకళాంలో ఇళ్ల నిర్మాణం, గొట్లాంలో నాడు- నేడు కార్యక్రమంలో నవీకరించిన పాఠశాలను, కుమిలిలో రైతు భరోసా కేంద్రాన్ని, ఎం.డి.యు. నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాన్ని పరిశీలించనున్నారు కేంద్ర మంత్రి. అలాగే, జిల్లా కేంద్ర ఆసుపత్రిని, రామతీర్థంలో ఆలయాన్ని సందర్శించనున్నారు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ. దేశంలో…