Story Board: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్…సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ఊరించే ప్రకటనలు…సెలబ్రెటీల ప్రచారంతో…అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులనుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల దాకా…వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. కోట్లు పెట్టి బెట్టింగ్ ఆడుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్‌లో పెడుతున్నారు. అది సరిపోక…బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. బెట్టింగ్ యాప్స్…సామాన్యులకు మరణశాసనం రాస్తున్నాయి. బెట్టింగ్ ఆడవద్దని చెబుతున్నా…కొందరు పట్టించుకోవడం లేదు. డబ్బు పొగొట్టుకున్న తర్వాత…ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇంకొందరు దొంగలుగా మారుతున్నారు. మరికొందరు…