సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు. కేంద్రంపైన తెలంగాణ ప్రభుత్వం తరఫున మరింత ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు ఆదిలాబాద్ కి నాయకులు, జిల్లాలోని ఇతర ప్రముఖులు ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్లో కలిసి కంపెనీ పున ప్రారంభం చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు.…