సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. నిన్న శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు ప్రవీణ్ సూద్. జూబ్లీహిల్స్ లోని సిబిఐ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సీబీఐ గెస్ట్ హౌస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.