ఢిల్లీ బాంబ్ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు ప్రచారంతో మోసగించినందుకు యూనివర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాక్ గుర్తింపు లేకుండానే వైబ్‌సైట్‌లో మాత్రం కళాశాలకు గుర్తింపు ఉందంటూ బహిరంగంగా ప్రదర్శించింది.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించినందుకు కంపెనీ, దాని అనుబంధ సంస్థపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఎందుకు ప్రారంభించకూడదని కోరుతూ భారతదేశ క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్‌ఈసీఐ.. రిలయన్స్ పవర్‌కి షోకాజ్ నోటీసు పంపింది.