పంచదార అన్న పదం వినగానే నోట్లో నీళ్ళూరుతాయి. ముఖ్యంగా చిన్నతనంలో పంచదారను ఎక్కువగా తింటుంటాం. అయితే, చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు సాధారణంగా తీపి పదార్ధాల రుచిని ఇష్టపడతారు. కానీ చిన్న పిల్లలకు చక్కెర ఇవ్వడం వారి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.