భూ చరత్రలో, మానవజాతి మొదలైనప్పటి నుంచి చరిత్రలో కనీవిని ఎరగనంతగా భూమిపై కార్బన్ డయాక్సైడ్ పెరుగుతోంది. తాజాగా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది మేలో భూగ్రహంపై సీఓ2 వాయువు రికార్డ్ స్థాయికి చేరుకుందని వెల్లడించింది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న కార్బన్ డయాక్సైడ్ తో పోలిస్తే 50 శాతం అధికంగా వాతావరణంలోకి సీఓ2 విడుదల అవుతోంది. జూన్ 3న హవాయ్ లోని మౌనాలోవా అగ్నిపర్వతంపై ఉన్న…