Record car sales: 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు నమోదు అయ్యాయి. కార్ల అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఎస్ యూ వీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా అమ్మకాల్లో మంచి వృద్ధి సాధించాయి. మొత్తం ఎఫ్‌వై(ఫైనాన్షియల్ ఇయర్) 23లో 3,889,545 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.