CM Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరంకు పనులకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అధికారులు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు నీటి సమస్య లేకుండా చేయొచ్చని ఆయన అన్నారు. పోలవరం ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు.. 2014-19 మధ్య రేయింబవళ్ళు పని…