వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కరెంటుతో కానీ, డీజిల్‌తో కానీ పనిచేయదు. బదులుగా రైలు 'నీటి'తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్ణయించారు.
దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తొలిసారిగా లాభాల్లోకి వచ్చింది. మంగళవారం కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనం అయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా.. ముగింపులో మాత్రం లాభాలు ఆవిరైపోయాయి.
ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించాలని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ సమర్థించారు. అంతేకాదు ఓటింగ్ మెషీన్‌పై కూడా ఆందోళన కరమైన అంశాన్ని పంచుకున్నారు.
ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ 2000 మందిని తొలగించింది. గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపును చేసింది. అంతకుముందు ఖర్చులను తగ్గించుకునేందుకు యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు.
ప్రస్తుతం వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ దుకాణానికి వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కిరాణా నుంచి బట్టలు, ఇతర వస్తువులను బయటే కొనేందుకు కొంత మంది విముఖత చూపుతారు.
దేశంలో 5జీ నెట్‌వర్క్ దూసుకుపోతోంది. క్రమ క్రమంగా ఈ నెట్‌వర్క్ గ్రామాలకు సైతం విస్తరించింది. టెలికాం నెట్‌వర్క్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. 5జీ సేవలు మరిన్ని మారుమూల గ్రామాలకు చేరవేచే పనిలో ఉంది.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విదేశాల్లో పర్యటించి అందమైన జ్ఞాపకాలు కూడగట్టుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వేరే దేశానికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరమని మనందరికీ తెలుసు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్‌బర్గ్ మూడో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన నికర విలువ $204 బిలియన్లు.