Sankranti 2023: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రోజువారీ సర్వీసుల్లో సీట్లన్నీ నిండిపోయాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినా..సీట్లు, బెర్త్‌లు దొరక్కపోవడంతో కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి సుమారు 12 లక్షల మందికిపైగా…