సినీ ఫక్కిలో బస్సు దోపిడీకి యత్నించారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భైంసా నుంచి నవీపేట్ మీదుగా హైదరాబాద్‌కు భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున బయలు దేరింది. అయితే నవీపేట్ మండలం అబ్బాపూర్ (ఎం) గ్రామ సమీపంలోకి బస్సు రాగానే నలుగురు దుండగులు రాళ్లతో బస్సుపైకి దాడి చేసి దోపిడీ యత్నించారు. దీంతో ప్రతిఘటించిన ప్రయాణీకులు.. గట్టిగా కేకలు వేయడంతో ఆ నలుగురు దుండగులు…