Jasprit Bumrah: భారతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా గాయంతో ఐపీఎల్ 2025 ప్రారంభంలో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులో ఉండడంలేదని ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేసే బుమ్రా లేని లోటును ముంబయి ఇండియన్స్ ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా బౌలింగ్ విభాగానికి వెన్నెముక. అతడు తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2016లో…