ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీ లతో భేటీ కానున్నారు. ఈనెల18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈనెల 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య-ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈనెల 22న ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ పై…