తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తెలంగాణలోనే కొనసాగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఈ వ్యవహారంలో కేంద్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా కేంద్రం సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించింది. పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఏపీకి కేటాయించడాన్ని తప్పుపడుతూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ లో వారంతా…