BRS central office: ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్గు ఇవాళ మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించే యాగశాల, సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో పాల్గొంటారు.
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ శకం మొదలైంది. జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు అధినేత కేసీఆర్ హస్తినలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రాజశ్యామల యాగం, చండీయాగం, యాగ పూర్ణాహుతిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. వేదపండితుల ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాలకు నూతన కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి.. తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ…