రెండో ప్రపంచ యుద్దం సమయంలో జర్మనీ దళాలు పెద్ద ఎత్తున యూరోపియన్ దేశాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. జర్మనీ, దీని మిత్రపక్షాలు బ్రిటన్‌పై పెద్ద ఎత్తున బాంబు దాడిని చేశారు. అప్పట్లో జర్మనీ వేసిన బాంబుల్లో కొన్ని పేలగా చాలా వరకు అవి పేలలేదు. కాగా, అవి కాలగర్బంలో భూమిలో కలిపిపోయాయి. కాగా, ఇప్పుడు ఆ బాంబులు బ్రిటన్‌ను ఇబ్బందులు పెడుతున్నాయి. పేలకుండా భూమిలో ఉండిపోయిన బాంబులను అక్కడి ప్రత్యేక అధికారులు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు.…
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియన్సీ క్యారీ సైమండ్స్ ను జాన్సన్ పెళ్లి చేసుకున్నారు. శనివారం రోజున లండన్ లోని వెస్ట్ మినిస్టర్ రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్‌లో ఈ వివాహ కార్యక్రమం ముగిసింది. బోరిస్ జాన్సన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అక్కడి మీడియా పేర్కొంది. దీనిపై బోరిస్ జాన్సన్ అధికారిక కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మాట్లాడటానికి మీడియా నిరాకరించినట్లు మీడియా తెలిపింది.…
ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది. అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది. దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్…