చెన్నైలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఉదయం 6 గంటలకు మాధవరం బర్మా కాలనీ ప్రాంతానికి చెందిన విజయకుమార్ అనే వ్యక్తికి పెరంబూరులోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అర్చనకు బెసెంట్ నగర్ చర్చిలో వివాహం జరిగింది.. పెళ్లి తర్వాత కొత్త జంట ఇంటికి వచ్చింది.. అయితే, సాయంత్రం జరగనున్న రిసెప్షన్ కోసం తాను బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన అర్చన.. ఎంతకీ రాకపోవడంతో అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు..