Today Business Headlines 18-03-23: తెలంగాణ సహా 7 రాష్ట్రాలకి..: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు మెగా టెక్స్‌టైల్ పార్క్‌లను కేటాయించింది. ఈ రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు మూడు ఉండటం గమనించాల్సిన విషయం. ఈ పార్కులు.. ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారన్ అనే 5 ఎఫ్ విధానంతో జౌళి రంగానికి ఊతమిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.