వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 40 రోజుల పసికందు.. ఆమె ఆరేళ్ల సోదరుడు ప్రాణాల కోసం పోరాడుతుండగా.. వారిద్దరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయారు. వారి ఇల్లు కూడా ధ్వంసమైంది. అయితే.. ఆ కుటుంబంలో పసికందు అనారా, సోదరుడు మహ్మద్ హయాన్ సురక్షితంగా బయటపడ్డారు.
Huge Calabash in Boy Stomach in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడి కడుపులోంచి అడుగుకు పైగా పొడవున్న సొరకాయను వైద్యులు బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. యువకుడికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అతడి శరీరంలోకి ఇది మలద్వారం ద్వారా వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా? లేదా ఇంకేమైనా జరిగిందా? అన్నది…
దమ్మాయిగూడ బాలాజీనగర్‌కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు. ఇక హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా వివరాలు సక్రమంగానే ఉన్నా ఫొటో, సంతకం మాత్రం అమ్మాయిది రావడంతో కంగుతిన్నాడు..
Dogs Attack: జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో వీధి కుక్కల వీరంగం సృష్టించాయి.ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్ పై విచక్షణారహితంగా దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమాయక బాలుడిని ఓ మృగాడు పొట్టన పెట్టుకున్నాడు. తాగిన మైకంలో ఏమీ ఏర్పడక కడతేర్చారు. బాలుడిని దారుణంగా నేలకేసి కొట్టి చంపాడు సవతి తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
పబ్జీ గేమ్లో పరిచయం.. దేశాలు దాటేలా చేసింది. గతంలో పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ ఇదే పబ్జీలో ఇండియాకు చెందిన సచిన్తో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో.. తన భర్తను వదిలేసి పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఈ ఘటన అప్పుడు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా.. పబ్జీ గేమ్లో యూపీ ఇటావాకు చెందిన ఓ యువకుడితో అమెరికా అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా.. ఆ బాలిక యువకుడిని కలవడానికి ఇటావా వచ్చింది.
Hair Cutting: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు తనకు ఇష్టం లేని జుట్టు కత్తిరించాడన్న కోపంతో పురుగుల..