ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు ఏదో అన్నారని బాధతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరంలో చోటుచేసుకుంది.