ఐపీఎల్‌లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడు అవేశ్ ఖాన్. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా పేసర్ అవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేయడంతో దాన్ని వాళ్ల నాన్నకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో అంతగా రాణించకపోయినా.. అతడు ఈ మ్యాచ్‌లో 4/18 మేటి ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం…