Minister Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పర్యటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రుషికొండ బీచ్ లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు విధానాల అవశేషాలతో పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖకు ఊహించని షాక్ తగిలింది. విశాఖలో అత్యంత పర్యాటక ఆదరణ పొందిన రుషికొండ బీచ్ ప్రతిష్ఠాత్మక బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా రుషికొండకు పేరుంది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా రద్దు అవ్వడంతో తీరంలో జెండాలను టూరిజం అధికారులు తొలగించారు. పర్యాటక పరంగా గొప్ప అవకాశంగా ఉన్న దీన్ని తొలగించడంతో ఏపీ పరువు మంటగలిసినట్లుయింది. రుషికొండ దగ్గర 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్…