సాధారణంగా రష్యాలాంటి శీతల దేశాల్లో మంచు కురవడం సహజమే. మంచు అంటేనే తెల్లగా ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కురిసే మంచుమాత్రం నల్లగా ఉంటుందట. దీనిక కారణం లేకపోలేదు. మంచు విపరీతంగా కురిసే ఓంసుచన్ అనే ప్రాంతంలో ప్రజలకు వేడిని అందించేందుకు బొగ్గుతో నడిచే ఓ ప్లాంట్‌ను నిర్మించారు. ఇక్కడ సుమారు నాలుగువేల మందికి ఆ బొగ్గుఆధారిత ప్లాంట్ ద్వారా వేడి లభిస్తుంది. బొగ్గు కాల్చేసమయంలో వెలువడే పొగకారణంగా ఆ ప్రాంతంలో నిత్యం నల్లని దుమ్ముపేరుకుపోయి కనిపిస్తున్నది.…