Pakistan Balochistan crisis: తాను పెంచిపోషించిన ఉగ్రమూకలపై పాకిస్థాన్ నియంత్రణ కోల్పోయింది. ఒకరకంగా వాటి చేతిలో ఓడిపోయిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ సైన్యం బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులపై నియంత్రణ కోల్పోతున్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలను BLA తిరుగుబాటు గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థాన్ పార్లమెంటులో ఆ దేశ సెనేటర్ కమ్రాన్ ముర్తజా దీనిని అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటులో మాట్లాడుతూ.. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తిరుగుబాటుదారులు…