ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం అని ఆయన అభివర్ణించారు. దేశంలో తమ పాలనకు ప్రజలు ఇచ్చిన బహుమతి అని తెలిపారు. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైందని.. ఇవాళ్టి ఫలితాల్లో గొప్ప సందేశం ఉందన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసం పొందేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేశారు కాబట్టి ఇది కార్యకర్తల విజయమని మోదీ తెలిపారు. దేశంలోని నాలుగు వైపులా ప్రజలు…