అమెరికా పర్యటనలో సిక్కులపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిక్కులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. బీజేపీ నేతల తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.