పాలకులు ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉత్తరాంధ్ర ఉత్తమంగా ఉండాలి. వందేళ్ళ నుండి ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగానే ఉంది. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్దిపై చిన్న చూపు చూసాయి. భూములు ఉండి కూడా ఉత్తరాంధ్ర వాసులు దేశ వ్యాప్తంగా వలసలు పోతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నీటి ప్రాజెక్టులు విడిచి పెట్టి పోలవరం గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరంపై ఉన్న శ్రద్ధ మిగిలిన ప్రాజెక్టుల పై ఉండటం లేదు.…