కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో ‘‘అవినీతి రేటు కార్డు’’ ప్రకటనపై బీజేపీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరుకు రానున్నారు. బీజేపీ పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు.. గత బీజేపీ ప్రభుత్వం అవినీతిమయమైందని ఆరోపించారు.