తమిళనాడులో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంకోవైపు అధికార డీఎంకే కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా పోరాటం చేస్తోంది. తమపై హిందీ భాష బలవంతంగా రుద్దుతోందని నిరసన గళాన్ని రేపుతోంది. ఇలా అధికార-విపక్షాల మధ్య రాజకీయ వార్ మొదలైంది.