రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ రాష్ట్రానికి అంతా తామే చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఆడిన మాటను తప్పే వారిని ఏమంటారో బీజేపీ వాళ్లు గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేని బీజేపీ విశాఖ ఉక్కును అమ్మేస్తానంటోంది.ప్రజలు బీజేపీని ఛీత్కరిస్తున్నారు.బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ,…