కరిచింది పెంపుడు కుక్కే కదా అని చేసిన నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. కుక్కకు రాబిస్ సోకిన విషయం తెలుసుకోకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆలస్యం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యువకుడు. ఈ విషాదం విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. తండ్రి నర్సింగరావు ఆర్టీసీలో కండక్టర్ గా పని చేసి గత ఎనిమిదేళ్లుగా పెరాలిసిస్ వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. కుమారుడు భార్గవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.
పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని స్వయంగా మంత్రి హర్జోత్ సింగ్.. ట్విటర్ వేదికగా వెల్లడించారు.