తెలుగు తెరపై యాక్షన్ క్వీన్ అనిపించుకున్న తొలి నటి విజయలలిత. భారతీయ చలన చిత్రసీమకు ‘ఫియర్ లెస్ నాడియా’ ఎలాగో, తెలుగు తెరకు విజయలలిత అలాగా అంటూ ఆమెను అభిమానులు కీర్తించారు. నర్తకిగా, నటిగా, ఐటమ్ గాళ్ గా, వ్యాంప్ గా విభిన్నమైన పాత్రల్లో మెప్పించారు విజయలలిత. ‘లేడీ జేమ్స్ బాండ్’ అనే పేరూ సంపాదించారు. ఆమె అక్క కూతురు విజయశాంతి. ఆమె కూడా విజయలలితలాగే తన తరం హీరోయిన్స్ లో యాక్షన్ క్వీన్ గా సాగారు.…