Hyderabad: అతివేగం మరో యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కాప్రా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రాలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న ఎం. శేఖర్ (23) కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.