బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ రౌండ్‌లో హౌస్ మొత్తం హీటెక్కిపోయింది. ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కొత్త ఉత్కంఠను రేపింది. టెడ్డీ బేర్‌లను సేఫ్ జోన్‌కి తీసుకెళ్లే గేమ్‌లో చివరగా చేరిన కంటెస్టెంట్స్ నామినేషన్ జాబితాలో చేరడం రూల్‌గా ఉండటంతో హౌస్‌లో టెన్షన్ మొదలైంది. మొదటి రౌండ్‌లో సంజన నామినేట్ కాగా, తరువాతి రౌండ్‌లో భరణి–తనూజ మధ్య తీవ్రమైన వాదన చెలరేగింది. “తనూజ కారణంగానే నేను హౌస్ నుంచి…