బిగ్ బాస్ సీజన్ 5కు రంగం సిద్ధమైంది. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులలో కుతూహలాన్ని పెంచుతూ పోయాయి. ఇప్పుడు సీజన్ 5 కూడా అదే స్థాయిలో గత సీజన్స్ టీఆర్పీని క్రాస్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఎన్టీయార్ తో మొదలై, నాని చేతుల మీదుగా నాగార్జున భుజస్కందాలపైకి బిగ్ బాస్ షో చేరింది. చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు. ఇప్పుడీ ఐదో సీజన్…