టీమిండియా ఓటమి చవిచూసినప్పుడల్లా.. కెప్టెన్లపై విమర్శలు వెల్లువెత్తడం సర్వసాధారణం. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, కెప్టెన్ తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓటమి చవిచూసిందంటూ కొందరు కావాలనే విమర్శలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు రిషభ్ పంత్‌పై అలాంటి విమర్శలే వస్తున్నాయి. రిషభ్ నాయకత్వంలో భారత్ 211 పరుగులు కొట్టినా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాల్వడంతో అతడ్ని విమర్శిస్తున్నారు. జట్టును నడిపించేంత సామర్థ్యం అతనికి లేదని, ఎవరైనా సీనియర్ ప్లేయర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే రిషభ్‌కు…
టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్ పరోక్షంగా హెచ్చరించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భువనేశ్వర్‌కుమార్ రాణించకుంటే పుజారా, రహానే మాదిరి జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హితవు పలికారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బీసీసీఐ టెస్టు జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలపై వేటు పడిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ భువనేశ్వర్‌కు కూడా డెత్ సిరీస్ అని భావించొచ్చన్నారు.…