Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి భూటాన్ రాజు వచ్చారు. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఆయన త్రివేణి సంగమంతో పవిత్ర స్నానం చేశారు. దీనికి ముందు రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ సూర్యుడికి ‘‘అర్ఘ్యం’’ సమర్పించారు.