Off The Record: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా, నర్సాపురం లోక్‌సభ పరిధిలో కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్‌గా పేరున్న సీటు భీమవరం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఒక్కసారిగా అందరి పొలిటికల్ అటెన్షన్ భీమవరం వైపు మళ్ళింది. అప్పుడు గెలుపు ఓటముల సంగతి వేరే స్టోరీ. తిరిగి మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న టైంలో… ఇక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు లాంఛనమేనన్న వాతావరణం ఏర్పడటంతో…